కొత్తగా చేరిన సన్యాసిని మఠాధిపతి దగ్గరకు
కంగారుగా వచ్చి చెప్పింది..
"ఆచార్యులవారూ,నా బకెట్
పగిలిపోయిందండి!ఇప్పుడేం చేయాలి?"
వారు ప్రశాంతంగా జవాబిచ్చారు:
"మాతా!..ఈ మఠంలో నా అనే వస్తువేదీ ఉండదు.
అన్నీ మన వస్తువులే.నా అని అనకూడదు.
నెల రోజుల తరువాత మళ్ళీ ఆమె ఆయన
దగ్గరకు వచ్చి ఇలా చెప్పింది..
"నా చీపురు అరిగి పోయిందండి.
కొత్త చీపురు కావాలి".
మఠాధిపతి ఇలా చెప్పారు:
అలా అనకూడదని ఇంతకు ముందే చెప్పా కదా.
ఈ మఠం లో ’నా’ అనే వస్తువేదీ వుండదు.
అన్నీ మన వస్తువులే.కాబట్టి,
ఆ చీపురు మన అందరిదీ."
ఒకరోజు మఠాధిపతి గారు ఆయన భక్తుల
ఎదురుగా కూర్చొని ఉన్నప్పుడు..
ఆమె మళ్ళీ వచ్చింది.
"ఆచార్యుల వారూ..మన మంచం విరిగి పోయిందండీ.
వెంటనే బాగు చేయించాలండీ, లేకపోతే..
మనకి కష్టం!!!. అని చెప్పింది.....
*(మల్లిక్ చిలిపి నుంచి సంగ్రహించింది)
No comments:
Post a Comment