Saturday, March 7, 2009

చంద మామ లాంటి భార్య....

తండ్రి: ఒరేయ్ రవీ..నీకెలాంటి భార్య కావాలి?

రవి: నాకు చందమామ లాంటి భార్య కావాలి నాన్న గారు.

తండ్రి: ఎందుకు?

రవి: చందమామ ఐతే,

రాత్రివచ్చి, పగలు వెళ్ళి పోతుంది కదా.అందుకు.

తండ్రి: ???

Wednesday, May 21, 2008

ప్రశ్నా? ఇన్వైటా?

పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిని పెళ్లి కూతురు తండ్రి
ఇలా ప్రశ్నించాడు:
"నీకు తాగుడు అలవాటు ఉందా?"

దానికా అబ్బాయి: "ముందు మీరు చెప్పండి..
మీరు నన్ను ప్రశ్నిస్తున్నారా? లేక..
ఇన్వైట్ చేస్తున్నారా?"

Wednesday, May 14, 2008

బంగారు చైయిన్

రవి: ఒరేయ్ నాకో డౌట్.
రాజు: ఏంటి?
రవి: బంగారు చైయిన్ కరిగిస్తే బంగారం వస్తుంది,
అలాగే సిల్వర్ చైయిన్ కరిగిస్తే సిల్వర్ వస్తుంది.
మరి సైకిల్ చైయిన్ కరిగిస్తే..?
రాజు: అది కూడా తెలియదా?
సైకిల్ వస్తుంది.!!

Sunday, May 11, 2008

నా మంచం..

కొత్తగా చేరిన సన్యాసిని మఠాధిపతి దగ్గరకు

కంగారుగా వచ్చి చెప్పింది..

"ఆచార్యులవారూ,నా బకెట్

పగిలిపోయిందండి!ఇప్పుడేం చేయాలి?"

వారు ప్రశాంతంగా జవాబిచ్చారు:

"మాతా!..ఈ మఠంలో నా అనే వస్తువేదీ ఉండదు.

అన్నీ మన వస్తువులే.నా అని అనకూడదు.

నెల రోజుల తరువాత మళ్ళీ ఆమె ఆయన

దగ్గరకు వచ్చి ఇలా చెప్పింది..

"నా చీపురు అరిగి పోయిందండి.

కొత్త చీపురు కావాలి".

మఠాధిపతి ఇలా చెప్పారు:

అలా అనకూడదని ఇంతకు ముందే చెప్పా కదా.

ఈ మఠం లో నా అనే వస్తువేదీ వుండదు.

అన్నీ మన వస్తువులే.కాబట్టి,

ఆ చీపురు మన అందరిదీ."

ఒకరోజు మఠాధిపతి గారు ఆయన భక్తుల

ఎదురుగా కూర్చొని ఉన్నప్పుడు..

ఆమె మళ్ళీ వచ్చింది.

"ఆచార్యుల వారూ..మన మంచం విరిగి పోయిందండీ.

వెంటనే బాగు చేయించాలండీ, లేకపోతే..

మనకి కష్టం!!!. అని చెప్పింది.....

*(మల్లిక్ చిలిపి నుంచి సంగ్రహించింది)

నిజమైన స్నేహితుడు

హాస్పిటల్ లో ఆరోగ్యం సరిగ్గా లేక

నువ్వుంటే..

మంచి స్నేహితుడు వచ్చి,పలకరించి,

పువ్వులిచ్చి వెళ్ళిపోతాడు.

అదే నిజమైన స్నేహితుడు అయితే..

వచ్చి పక్కన కూర్చొని,

"మామా! నర్సులు భలే వున్నారు!!

ఇక్కడే వుండి,ఎంజాయ్ చెయ్!!" అంటాడు.

ఎమ్మెస్ ఆఫీస్

వెంగళప్ప ఒక ఇంటర్వ్యూ కి వెళ్ళాడు.

ఇంటర్వ్యూ చేసే ఆయన:

"నీకు ఎమ్మెస్ ఆఫీస్ తెలుసా?"

వెంగళప్ప: అడ్రస్ చెపితే పోయి వస్తా సార్.

???

పుస్తకం

లెక్చరర్: ఒరే గిరీ..ఒక పుస్తకం బాగా

అమ్ముడు పోవాలంటే,ఏం చేయాలి?

గిరి: ఏముంది సార్..పుస్తకం పైన అమ్మాయి

బొమ్మ ఉండాలి.కానీ..అమ్మాయి పైన

ఏమీ ఉండకూడదు!!!