ఫ్రెండ్స్..
తెలుగు జోక్స్ అందించాలని చాలా రోజులుగా ఆశ. చదివి బాగా నవ్వుకుంటారని ఆశిస్తున్నాను.
BILAL TEACHER
*********************************************************************************
అనిరుధ్: సార్..నా భార్య కనిపించట్లేదండి.
పోలిస్: ఆవిడ ఎలా ఉంటారు? ఫోటో ఏమైనా ఉందా?
అనిరుధ్: ఉంది సార్..కానీ ఫోటో లో ఉన్నట్టే ఉండాలనేం లేదు సార్.. త్రిష లానో, స్నేహ లానో ఉన్నా ఓ.కే.
పోలిస్: ?????!!!!!!
******************************************
పెళ్ళైన కొత్తలో మీ పళ్ళెంలోంచి తీసి మరీ నాకు గోరుముద్దలు తినిపించే వారు..ఇప్పుడు ప్రేమ తగ్గిపోయిందా?.. గోముగా భర్త ను అడిగింది పంకజం.
"నువ్వు అప్పట్లోలా వండట్లా.. అన్నీ రుచిగా ఉంటున్నాయిప్పుడు!"..చెప్పారు శ్రీవారు.
***********************************
రాత్రి తొమ్మిదింటికి డాక్టర్ సునీల్ కు ఫొన్ వచ్చింది..."పేకాట ఆడడానికి అర్జెంటుగా రమ్మని దాని సారాంశం". సునీల్ చక చకా రెడీ ఔతున్నాడు
ఈ రాత్రి ఎక్కడికండీ?..ఎవరికైనా సీరియస్సా?.. అడిగింది వాళ్ళావిడ.
ఔను..ఇప్పటికే అక్కడ ముగ్గురు డాక్టర్లు ఉన్నారు.....అని హడావిడి గా వెళ్ళిపోయాడు సునీల్.
************************************
1 comment:
రెండూ,మూడూ సూపరు బాగున్నాయికొనసాగించండి
Post a Comment