Saturday, April 26, 2008

రాము డాక్టర్ దగ్గరికి వచ్చి, ఒక వ్యక్తి ఏడవడం చూసి..

అతన్ని అడిగాడు:ఎందుకు ఏడుస్తున్నావు?

ఆ వ్యక్తి: బ్లడ్ టెస్ట్ కని వస్తే..నా వేలు కోసేశారు..

రాము: అయ్య బాబోయ్!...నేను యూరిన్ టెస్ట్ కు వచ్చాను..అని అక్కడ నుంచి పారి పోయాడు.

************************************

రవి: నిన్ను ప్రేమించిన మొదటి యువకుణ్ణి నేనే కదూ?..

రాధ: ఔను..మిగిలిన వాళ్ళంతా కొంచెం వయసు మళ్ళిన వారు.

రవి: ??!!!!

************************************

భర్త: నేను చనిపోతే, నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకుంటావా?

భార్య: అయ్యో లేదండి. నా చెల్లి తో కలిసి ఉంటాను.

భార్య: నేను చనిపోతే మీరు పెళ్ళి చేసుకుంటారా?

భర్త: చేసుకోను. నేను కూడా నీ చెల్లితో కలిసి ఉంటాను.!!!

************************************

లాయర్: మీ మొదటి ఇద్దరు భర్తలు ఎలా చని పోయారు?

రాధ: పురుగుల మందు తాగి!

లాయర్: మరి మీ మూడవ భర్త ఎలా చని పోయారు?

రాధ: బుర్ర పగిలి!!

లాయర్: బుర్ర పగిలా? అదెలా?

రాధ: ఏముంది..పురుగుల మందు తాగ మన్నాను..తాగలేదు..అందుకే,

బుర్ర పగల గొట్టా!!!!

లాయర్: ఆ....

*************************************

No comments: