Wednesday, May 21, 2008
ప్రశ్నా? ఇన్వైటా?
ఇలా ప్రశ్నించాడు:
"నీకు తాగుడు అలవాటు ఉందా?"
దానికా అబ్బాయి: "ముందు మీరు చెప్పండి..
మీరు నన్ను ప్రశ్నిస్తున్నారా? లేక..
ఇన్వైట్ చేస్తున్నారా?"
Wednesday, May 14, 2008
బంగారు చైయిన్
రాజు: ఏంటి?
రవి: బంగారు చైయిన్ కరిగిస్తే బంగారం వస్తుంది,
అలాగే సిల్వర్ చైయిన్ కరిగిస్తే సిల్వర్ వస్తుంది.
మరి సైకిల్ చైయిన్ కరిగిస్తే..?
రాజు: అది కూడా తెలియదా?
సైకిల్ వస్తుంది.!!
Sunday, May 11, 2008
నా మంచం..
కొత్తగా చేరిన సన్యాసిని మఠాధిపతి దగ్గరకు
కంగారుగా వచ్చి చెప్పింది..
"ఆచార్యులవారూ,నా బకెట్
పగిలిపోయిందండి!ఇప్పుడేం చేయాలి?"
వారు ప్రశాంతంగా జవాబిచ్చారు:
"మాతా!..ఈ మఠంలో నా అనే వస్తువేదీ ఉండదు.
అన్నీ మన వస్తువులే.నా అని అనకూడదు.
నెల రోజుల తరువాత మళ్ళీ ఆమె ఆయన
దగ్గరకు వచ్చి ఇలా చెప్పింది..
"నా చీపురు అరిగి పోయిందండి.
కొత్త చీపురు కావాలి".
మఠాధిపతి ఇలా చెప్పారు:
అలా అనకూడదని ఇంతకు ముందే చెప్పా కదా.
ఈ మఠం లో ’నా’ అనే వస్తువేదీ వుండదు.
అన్నీ మన వస్తువులే.కాబట్టి,
ఆ చీపురు మన అందరిదీ."
ఒకరోజు మఠాధిపతి గారు ఆయన భక్తుల
ఎదురుగా కూర్చొని ఉన్నప్పుడు..
ఆమె మళ్ళీ వచ్చింది.
"ఆచార్యుల వారూ..మన మంచం విరిగి పోయిందండీ.
వెంటనే బాగు చేయించాలండీ, లేకపోతే..
మనకి కష్టం!!!. అని చెప్పింది.....
*(మల్లిక్ చిలిపి నుంచి సంగ్రహించింది)
నిజమైన స్నేహితుడు
హాస్పిటల్ లో ఆరోగ్యం సరిగ్గా లేక
నువ్వుంటే..
మంచి స్నేహితుడు వచ్చి,పలకరించి,
పువ్వులిచ్చి వెళ్ళిపోతాడు.
అదే నిజమైన స్నేహితుడు అయితే..
వచ్చి పక్కన కూర్చొని,
"మామా! నర్సులు భలే వున్నారు!!
ఇక్కడే వుండి,ఎంజాయ్ చెయ్!!" అంటాడు.
ఎమ్మెస్ ఆఫీస్
వెంగళప్ప ఒక ఇంటర్వ్యూ కి వెళ్ళాడు.
ఇంటర్వ్యూ చేసే ఆయన:
"నీకు ఎమ్మెస్ ఆఫీస్ తెలుసా?"
వెంగళప్ప: అడ్రస్ చెపితే పోయి వస్తా సార్.
???
పుస్తకం
లెక్చరర్: ఒరే గిరీ..ఒక పుస్తకం బాగా
అమ్ముడు పోవాలంటే,ఏం చేయాలి?
గిరి: ఏముంది సార్..పుస్తకం పైన అమ్మాయి
బొమ్మ ఉండాలి.కానీ..అమ్మాయి పైన
ఏమీ ఉండకూడదు!!!
Saturday, May 10, 2008
అందుకే అంత ఫాస్ట్...
ఒక జపాన్ వాడు ఇండియా కు వచ్చాడు.
ఆటోలో ఎయిర్ పోర్ట్ కు బయలుదేరాడు.
ఆటో ను ఒక హోండా ఓవర్ టేక్ చేసింది.
"హోండా జపాన్ లో తయారైంది.అందుకే
అంత ఫాస్ట్" అన్నాడు జపానీ.
ఆ తరువాత ఒక టయోటా
ఆటో ను దూసుకెళ్ళింది.
"టయోటా జపాన్ లోనే తయారైంది.
అందుకే అంత ఫస్ట్" అన్నాడు జపానీ.
ఎయిర్ పోర్ట్ సమీపించింది.
’డబ్బు ఎంతైంది?’ అని అడిగాడు జపానీ.
"తొమ్మిదొందలు" అని చెప్పాడు ఆటోవాలా.
"అంతౌతుందా?" అని నోరెళ్ళబెట్టాడు జపానీ.
"మీటర్ మా దేశం లో తయారైంది.
Saturday, May 3, 2008
ఆ అమ్మాయి వల్లే..
"ఆ ఎదురింటి అమ్మాయిని చూసైనా నేర్చుకో..తను ఫస్ట్
క్లాస్ లో పాస్ అయింది."
కొడుకు: సరేలే.. రోజూ ఆ అమ్మాయిని చూడబట్టే నేను ఫెయిల్ అయింది.
తండ్రి : !!!!!!!
Friday, May 2, 2008
చివరి కోరిక
అతడిని ఎలక్ట్రిక్ చైర్ లో కూర్చోబెట్టారు.
"నీ చివరి కోరిక ఏమైనా ఉందా? అడిగాడు పోలీసు అధికారి.
"నాకు భయంగా ఉంది కాస్త నా చేయి పట్టుకుంటారా?"
అడిగాడా వ్యక్తి.
పంచవన్నెల కుర్రాడు
రామనాధం పార్కులో కూర్చున్నాడు.
ఎదురుగా జుట్టు కు రంగు వేసుకున్న
ఓ కుర్రాడు కనిపించాడు.
ఆకుపచ్చ,ఎరుపు,నీలం...వెంట్రుకలు భిన్న రంగుల్లో
ఉన్నాయి.
అతడినే తదేకంగా చూస్తున్నాడు రామనాధం.
"ఏం పెద్దాయనా!నువ్వు వయసులో ఉన్నప్పుడు
ఇలాంటి పనులు చేయలేదా?" అడిగాడతను.
’అదే ఆలోచిస్తున్నా.నీ వయసులో ఉన్నప్పుడు
ఓ సారి బాగా తాగి,నెమలి దగ్గరకు వెళ్ళాను.
కొంపదీసి నువ్వు నా కొడుకువి కాదు కదా’...
Saturday, April 26, 2008
రాము డాక్టర్ దగ్గరికి వచ్చి, ఒక వ్యక్తి ఏడవడం చూసి..
అతన్ని అడిగాడు:ఎందుకు ఏడుస్తున్నావు?
ఆ వ్యక్తి: బ్లడ్ టెస్ట్ కని వస్తే..నా వేలు కోసేశారు..
రాము: అయ్య బాబోయ్!...నేను యూరిన్ టెస్ట్ కు వచ్చాను..అని అక్కడ నుంచి పారి పోయాడు.
************************************
రవి: నిన్ను ప్రేమించిన మొదటి యువకుణ్ణి నేనే కదూ?..
రాధ: ఔను..మిగిలిన వాళ్ళంతా కొంచెం వయసు మళ్ళిన వారు.
రవి: ??!!!!
************************************
భర్త: నేను చనిపోతే, నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకుంటావా?
భార్య: అయ్యో లేదండి. నా చెల్లి తో కలిసి ఉంటాను.
భార్య: నేను చనిపోతే మీరు పెళ్ళి చేసుకుంటారా?
భర్త: చేసుకోను. నేను కూడా నీ చెల్లితో కలిసి ఉంటాను.!!!
లాయర్: మీ మొదటి ఇద్దరు భర్తలు ఎలా చని పోయారు?
రాధ: పురుగుల మందు తాగి!
లాయర్: మరి మీ మూడవ భర్త ఎలా చని పోయారు?
రాధ: బుర్ర పగిలి!!
లాయర్: బుర్ర పగిలా? అదెలా?
రాధ: ఏముంది..పురుగుల మందు తాగ మన్నాను..తాగలేదు..అందుకే,
బుర్ర పగల గొట్టా!!!!
లాయర్: ఆ....
*************************************
Sunday, February 10, 2008
BILAL JOKULU
ఫ్రెండ్స్..
తెలుగు జోక్స్ అందించాలని చాలా రోజులుగా ఆశ. చదివి బాగా నవ్వుకుంటారని ఆశిస్తున్నాను.
BILAL TEACHER
*********************************************************************************
అనిరుధ్: సార్..నా భార్య కనిపించట్లేదండి.
పోలిస్: ఆవిడ ఎలా ఉంటారు? ఫోటో ఏమైనా ఉందా?
అనిరుధ్: ఉంది సార్..కానీ ఫోటో లో ఉన్నట్టే ఉండాలనేం లేదు సార్.. త్రిష లానో, స్నేహ లానో ఉన్నా ఓ.కే.
పోలిస్: ?????!!!!!!
******************************************
పెళ్ళైన కొత్తలో మీ పళ్ళెంలోంచి తీసి మరీ నాకు గోరుముద్దలు తినిపించే వారు..ఇప్పుడు ప్రేమ తగ్గిపోయిందా?.. గోముగా భర్త ను అడిగింది పంకజం.
"నువ్వు అప్పట్లోలా వండట్లా.. అన్నీ రుచిగా ఉంటున్నాయిప్పుడు!"..చెప్పారు శ్రీవారు.
***********************************
రాత్రి తొమ్మిదింటికి డాక్టర్ సునీల్ కు ఫొన్ వచ్చింది..."పేకాట ఆడడానికి అర్జెంటుగా రమ్మని దాని సారాంశం". సునీల్ చక చకా రెడీ ఔతున్నాడు
ఈ రాత్రి ఎక్కడికండీ?..ఎవరికైనా సీరియస్సా?.. అడిగింది వాళ్ళావిడ.
ఔను..ఇప్పటికే అక్కడ ముగ్గురు డాక్టర్లు ఉన్నారు.....అని హడావిడి గా వెళ్ళిపోయాడు సునీల్.
************************************