Saturday, May 10, 2008

అందుకే అంత ఫాస్ట్...

ఒక జపాన్ వాడు ఇండియా కు వచ్చాడు.

ఆటోలో ఎయిర్ పోర్ట్ కు బయలుదేరాడు.

ఆటో ను ఒక హోండా ఓవర్ టేక్ చేసింది.

"హోండా జపాన్ లో తయారైంది.అందుకే

అంత ఫాస్ట్" అన్నాడు జపానీ.

ఆ తరువాత ఒక టయోటా

ఆటో ను దూసుకెళ్ళింది.

"టయోటా జపాన్ లోనే తయారైంది.

అందుకే అంత ఫస్ట్" అన్నాడు జపానీ.

ఎయిర్ పోర్ట్ సమీపించింది.

డబ్బు ఎంతైంది? అని అడిగాడు జపానీ.

"తొమ్మిదొందలు" అని చెప్పాడు ఆటోవాలా.

"అంతౌతుందా?" అని నోరెళ్ళబెట్టాడు జపానీ.

"మీటర్ మా దేశం లో తయారైంది.

అందుకే అంత ఫాస్ట్."అన్నాడు ఆటోవాలా.

No comments: